YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇసుక లో కూరుకుపోయిన గంటా కారు

 ఇసుక లో కూరుకుపోయిన గంటా కారు
పెథాయ్ తుఫాన్ సహాయక చర్యలను పర్యవేక్షించడానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కారు ఇసుకలో కూరుకుపోయింది. విశాఖపట్నంలోని భీమిలి తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులను పరామర్శించి, వారికి అందుతోన్న సహాయక చర్యల గురించి తెలుసుకోవడానికి సోమవారం ఉదయం తన టొయోటా ఫార్చ్యూనర్ కారులో గంటా వెళ్లారు. అయితే బీచ్‌ వద్ద ఇసుకలో నుంచి డ్రైవర్ కారును పోనివ్వడంతో చక్రాలు కూరుకుపోయాయి. దీంతో సహాయక సిబ్బంది చాలాసేపు కష్టపడి కారును బయటికి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే.. పెథాయ్ తుఫాన్ కోస్తా, ఉత్తరాంధ్రను వణికిస్తోంది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో పెథాయ్ బీభత్సం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12.15 గంటలకు తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద పెథాయ్ తుఫాన్ తీరాన్ని తాకింది. ఈ సమయంలో తీరం వెంబడి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసాయి. పెథాయ్ తుఫాన్ ప్రభావం విశాఖపట్నం జిల్లాపై కూడా పడింది. జిల్లాలోని పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల్లో బలమైన ఈదురగాలులు వీస్తున్నాయి. వర్షం కూడా పడుతోంది. 

Related Posts