YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జి.ఓ. 16 మేరకు ప్రభుత్వ ఉద్యోగాల అర్హతకు విద్యార్థులకు హామీ వ్యవసాయ విద్యార్థులు నిరసనలు మాని కళాశాలకు హాజరవ్వండి

జి.ఓ. 16 మేరకు ప్రభుత్వ  ఉద్యోగాల అర్హతకు విద్యార్థులకు హామీ  వ్యవసాయ విద్యార్థులు  నిరసనలు మాని కళాశాలకు హాజరవ్వండి
ప్రభుత్వ ఉత్తర్వులు 16 మేరకు వ్యవసాయ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు  అర్హత కలిగే  చర్యలు చేపడతామని రాష్ట్ర వ్యవసాయ  శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్ర మోహన్ రెడ్డి  అన్నారు.  సోమవారం  ఉదయం స్థానిక స్వర్ణ ముఖి అతిథి  గృహం లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.   ఈ సమావేశంలో వ్యవసాయ  కళాశాల విద్యార్థులు  భరత్, సౌమ్య,  దినేష్ లు   మంత్రి ని కలిసి జీఓ 16 ను పూర్తి స్థాయిలో వినతి పత్రం  సమర్పించారు.  ఐ సి ఏ ఆర్  ఆకృడెటెడ్ కళాశాలలో చదివే  వారికి మాత్రమే  ప్రభుత్వం ఎ ఓ, ఎ ఇ ఓ ఉద్యోగాలకు  అర్హత  ఉండేలా  చూడాలని, గత 42 రోజులుగా  వ్యవసాయ కళాశాల విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నామని వినతి పత్రం అందిచారు. మంత్రి వివరిస్తూ ఐ సి ఆర్ ఓ  రికనైజేడ్  అని కాకుండా  అక్రిడేటెడ్. లో సవరణకు ప్రభుత్వం నుండి తప్పక సవరణ చేపడతానని విద్యార్థులకు హామీ నిచ్చి క్దళాశాలకు హాజరవ్వలని సూచించారు.   ఐ సి ఏ ఆర్   గుర్తింపు లేని కళాశాలలను     చిత్తూరు, గుంటూరు జిల్లాలలో ఉన్నాయని గుర్తించి ఇప్పటికే క్రిమిన ల్ కేసులు పెట్టామని  జిల్లా కలెక్టర్లకు, ఎస్ పి లకు  నిరంతర పర్యవేక్షణ  ఆదేశాలు ఇఛ్చామని తెలిపారు.   
చిత్తూరు జిల్లా లో గత వారం లో నిర్వహించిన రైతుల గ్రీవెన్స్ కు 5550 మంది దరఖాస్తు చేసుకున్నారని, అందులో  1291 మంది తో పాటు మరో 550 మంది అర్హత గల వారిని గుర్తించామని  మరో  రూ. 6 కోట్లు అదనంగా ఋణ మాఫీకి  అర్హత పొందారని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా 3,47,352 మందికి రుణ మాఫీ చేశామని మరో 4,5 విడతలకు త్వరలో విడుదల కానున్నదని అన్నారు.  తుఫాను తీవ్రత వ్యవసాయ రంగం పై పెద్దగా వుండదని  తూర్పు గోదావరి లో 2,22,000 ఎకరాలలో వరి పంట  వుంటే 2,12,000 ఎకరాలలో కోతలు పూర్తి అయ్యాయని ,పశ్చిమ గోదావారిలో 2,26,000 ఎకరాలకు గాను 2,23,000 ఎకరాలు కోతలు పూర్తయ్యాయని అందువల్ల  పంట నష్టం చాలా తక్కువగా వుంటుందని, పత్తి  విషయం లో కూడా  ఇప్పటికే  3 కోతలు పూర్తయ్యాయని 4వ కోత మిగిలి వుందని అందుకే వ్యవసాయం పై ప్రభావం తక్కువగా వుంటుందని  అనుకూకుంటున్నామన్నారు. 
చిత్తూరు జిల్లాలో  నీటి వసతి కలిగిన అన్నీ రకాల పంటలకు రైతులకు బిందు సేద్యం 90 శాతం రాయితీ తో అందిస్తున్నానని 2018-19 కి గాను 35 వేల ఎకరాలకు నిర్దేశిస్తే లక్ష మంది  రైతులు దరఖాస్తులు చేసుకున్నారని వాటా చెల్లించిన ప్రతి రైతుకు  పరికరాలు అందించడం జరిగిందని అన్నారు.  ఈ ఖరీఫ్ లో దెబ్బ తిన్న  వేరుశనగ  1,20,000 మంది రైతులకు 89 వేల హెక్టార్లకు రూ. 120 కోట్లు అందించనున్నామని అన్నారు.  ఈ క్రాప్ లో మొదటి స్థానం, బిందు సేద్యం  లో దేశం లోనే మొదటి స్థానం, ప్రకృతి వ్యవసాయంలో  చిత్తూరు జిల్లా లో 50 శాతం పైగా కవర్ అయిందని తెలిపారు.   సమీక్షలో వ్యవసాయ అనుబంధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు

Related Posts