స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాలతో ముగిశాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి రెండు వారాల పాటు నష్టాలను చవిచూసిన మార్కెట్లు.. పుంజుకునేందుకు ప్రయత్నించాయి.. అయితే ఇవాళ మళ్లీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 144 పాయింట్ల నష్టంతో 34,155.95 పాయింట్ల వద్ద.. నిఫ్టీ 38.85 పాయింట్ల నష్టపోయి 10,500.90 వద్ద ట్రేడ్ అయ్యింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.11 వేల కోట్ల కుంభకోణం వెలుగుచూడటంతో.. దాదాపు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు బాగా నష్టపోయాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్లు దాదాపు పది శాతం నష్టపోయాయి.