ఒకప్పుడు కమర్షియల్ చిత్రాలలో కామన్ ఫార్ములా.. కమర్షియల్ దర్శకుల పాలిట ఆపద్బాంధవుడు హాస్య కిరీటి బ్రహ్మానందం. వీ.వీ వినాయక్, పూరి జగన్నాధ్, శ్రీను వైట్ల వంటి కమర్షియల్ డైరెక్టర్లు తీసిన సూపర్ హిట్ చిత్రాలలో బ్రమ్మీ కీలక పాత్ర పోషించాడు. అయన స్క్రీన్ మీద కనిపించిన వెంటనే ప్రేక్షకులు అందరు కడుపుబ్బా నవ్వుకునేవారు. 'కిక్' ఫేమ్ సురేంద్రరెడ్డి దర్శకత్వం వహించిన "రేసుగుర్రం" చిత్రంలో చివరి 20 నిమిషాల్లో బ్రహ్మానందం చేసిన కామెడీ మరువలేనిది.. ప్రస్తుతం ఆయనకు సినిమాలు సరిగ్గా లేవు. కొత్త కమెడియన్లు రావడం వల్లనో, బ్రమ్మీ రెమ్యూనరేషన్ ఎక్కువవడం వల్లనో దర్శక.. నిర్మాతలు ఆయనను పక్కన పెటేసారు. ప్రస్తుతం చిన్న, పెద్ద చిత్రాలలో మోస్ట్ వాంటెడ్ కమెడియన్ గా 'వెన్నెల' కిషోర్ ఎదిగాడు. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ బాగున్నా తెలుగు ప్రేక్షకులు బ్రహ్మానందం కామెడీ కి అలవాటు పడిపోయారు. ఎందుకంటె ఆయనే స్క్రీన్ ప్రెసెన్స్ కె ప్రేక్షకులు కడుపు చెక్కలు చేసుకుంటారు. ఒకప్పుడు ఆయనను నమ్ముకుని హిట్ కొట్టిన దర్శకులు ప్రస్తుతానికి వరుస ప్లాపులతో సతమతవుతున్నారు. మరి బ్రహ్మానందాన్ని రీప్లేస్ చేసేది ఎవరో.. కమర్షియల్ దర్శకుల పాలిట మరో బ్రమ్మీ ఎవరో చూడాలి.