YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం

రోగుల ఆహారంపై జీఎస్టీ రద్దు..

రోగుల ఆహారంపై జీఎస్టీ రద్దు..

జీఎస్టీ వచ్చాక అన్నింటిపై పన్నుల మోత మోగిపోతోంది. చిన్నచితకా వ్యాపారులు, సామాన్య జనం కూడా దాని వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రుల బిల్లుల్లోనూ జీఎస్టీ మోత చిన్నగా ఉండట్లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం ఆస్పత్రులకు ఓ చిన్న మినహాయింపునిచ్చింది. ఇన్ పేషెంట్లకు అందించే ఆహారంపై జీఎస్టీని రద్దు చేసింది. అయితే, ఆ వెసులుబాటు కేవలం ఆస్పత్రిలో చేరే రోగులకు మాత్రమే కలగనుంది. ఆస్పత్రిలో చేరకుండా ఆస్పత్రి వర్గాలు అందించే ఆహారం తీసుకునే వారు మాత్రం.. కచ్చితంగా పన్ను కట్టాల్సిందే. కాగా, ఆస్పత్రి నియమించుకున్న సీనియర్ డాక్టర్లు, కన్సల్టెంట్లు, టెక్నీషియన్ల సేవలపై ఎలాంటి జీఎస్టీని వసూలు చేయడం లేదని రెవెన్యూ శాఖ వెల్లడించింది. ఇన్‌పేషెంట్లు, వైద్యుల సేవలు ఆస్పత్రికి సంబంధించినంతవరకు ఆరోగ్య సేవల్లోకే వస్తాయి కాబట్టి.. వాటిపై జీఎస్టీని విధించట్లేదని పేర్కొంది. 

Related Posts