ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. 112/5 ఓవర్‌నైట్ స్కోరుతో చివరిరోజు బ్యాటింగ్ మొదలు పెట్టిన టీమిండియా కేవలం 28 పరుగులు మాత్రమే జోడించింది. టీమిండియా 140 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3, నాథన్ 3, హేజిల్‌వుడ్ 2, కమిన్స్ 2 వికెట్లు తీసుకున్నారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో అద్భుతమైన బౌలింగ్ వేసిన లియాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ రెండు జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా జరగనుంది.