YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నేపాల్ లో వంద నోట్లు చెల్లవ్

 నేపాల్ లో వంద నోట్లు చెల్లవ్
నేపాల్లో వంద నోటు కంటే పెద్ద నోట్లు చెల్లవు. నిషేధం ముందు వరకూ నేపాల్‌లో స్థానిక కరెన్సీతోపాటు భారత నోట్లు కూడా చెలామణిలో ఉండేవి.అయినా, నేపాల్ హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఇటీవల నేపాల్ మంత్రుల సమావేశం జరిగింది. అందులో 200, 500, 2000 విలువైన భారత నోట్లు నేపాల్‌లో చెలామణి చేయడం చట్టవిరుద్ధం అని నిర్ణయించారు. దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు.ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నేపాల్ దీనికి ఎలాంటి కారణం చెప్పలేదు. నేపాల్ తరఫున విడుదలైన అధికారిక ప్రకటనలో కూడా ఎలాంటి కారణాలూ పేర్కొనలేదు. అలాంటప్పుడు నేపాల్ హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?నేపాల్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇప్పటివరకూ స్పష్టంగా తెలీలేదని కాట్మండు సీనియర్ జర్నలిస్ట్ యువరాజ్ ఘిమ్రే చెప్పారు. ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉంటుందనేది స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉండే భారత వ్యాపారులకు సమస్యగా మారింది. దీనివల్ల భారత్‌కు ఏదైనా నష్టం ఉంటుందని నాకు అనిపించడం లేదు. రెండు దేశాల మధ్య పనులు, వ్యాపారం చేసుకునే ఇరు దేశాల ప్రజలపై ఈ ప్రభావం పడుతుంది అన్నారు.నేపాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకూ ఆచరణీయం. ఈ నిర్ణయం వల్ల ప్రజలు వంద కంటే ఎక్కువ నోట్ల లావాదేవీలు ఆపేస్తారా? అన్న ప్రశ్నకు ఘిమ్రే స్పందిస్తూ.. "ప్రభుత్వం నిర్ణయం వల్ల ప్రభావం ఉంటుందా, అనే ప్రశ్న చాలా కీలకం. అది కూడా ఈ నోట్లు ఇచ్చేవాళ్లకు కాదు, తీసుకునేవారికే సమస్య ఉంటుంది" అన్నారు.అయితే భారత్ నోట్లపై నేపాల్ నిషేధం విధించడానికి ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉందని ఘిమ్రే అంటున్నారు."1999లో భారత పర్యాటకుల విమానాన్ని తీవ్రవాదులు హైజాగ్ చేసినపుడు, భారత ప్రభుత్వం వినతితో నేపాల్ 500 నోట్లపై బ్యాన్ విధించింది. ఇక భారత్ నోట్లరద్దు తర్వాత నేపాల్‌లో కోట్ల విలువైన పాత 500, 1000 నోట్లు ఉండిపోయాయి. ఇప్పటివరకూ ఈ పాత నోట్లకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. భారత్ నోట్లరద్దు నిర్ణయం వల్ల నేపాల్‌కు నష్టం జరిగింది. కానీ నేపాల్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల దీనిపై ఎలాంటి ప్రభావం పడదు" అన్నారు.నోట్ల రద్దు వల్ల నేపాల్, భూటాన్‌కు చాలా నష్టం జరిగింది. భారత ఆర్థిక మంత్రిత్వశాఖ ఇప్పటివరకూ రెండు దేశాల్లో ఉన్న పాత నోట్ల గురించి గట్టిగా ఏదీ చెప్పడం లేదు".నేపాల్ ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం గురించి అక్కడ అందరూ ముందే ఊహించారని చెబుతున్నారు. భారతీయ కరెన్సీ చెలామణి చట్టబద్ధమే అనేలా నేపాల్, భూటాన్‌తో భారత్ ఎలాంటి అధికారిక ఒప్పందం చేసుకోలేదు.

Related Posts