YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గృహ నిర్మాణాలు వేగవంతం టెలి కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు

గృహ నిర్మాణాలు వేగవంతం టెలి కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గృహ నిర్మాణాలపై సీఎం చంద్రబాబునాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.  మంగళవారం జరిగిన ఈ టెలీ కాన్ఫరెన్స్ లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, బ్యాంకర్లు, పట్టణ, గ్రామీణాభివృద్ది అధికారులు పాల్గొన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం అత్యున్నత సంక్షేమ కార్యక్రమమన్నారు.  రాష్ట్రంలో రూ.80వేల కోట్లతో ఇళ్ల నిర్మాణం చేపట్టామని, అర్బన్లో 3,83,000 లబ్దిదారుల ఎంపిక పూర్తయ్యిందని తెలిపారు. పట్టణాల్లో 1,18,700 ఇళ్లకు శ్లాబులు పూర్తయ్యాయన్నారు. ప్లాట్ల కేటాయింపు కూడా వేగవంతం చేయాలన్నారు. మిగతా లబ్దిదారులను త్వరగా ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా నమూనాను అన్ని జిల్లాలు పాటించాలని సూచించారు. ఎన్టీఆర్ గ్రామీణ ఇళ్ల నిర్మాణంలో 4లక్షల ఇళ్లు పూర్తయ్యాయని సీఎం  అన్నారు. గ్రామాల్లో 4 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యాయని, మరో 2 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని సీఎం తెలిపారు. ఈ నెలలో 70 వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించారు. . బ్యాంకు రుణాల మంజూరుపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. బ్యాంకుల వారీగా లక్ష్యాలు పెట్టుకుని లక్ష్యం చేరుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఇసుక అందుబాటులో ఉంచాలని అధికారులకు సీఎం చంద్రబాబు తెలిపారు. త్వరలోనే లక్ష గృహాల సామూహిక ప్రవేశాలు ఏర్పాటు చేయాలని అన్నారు. 

Related Posts