మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల 'ఒక మనసు' వంటి సున్నితమైన ప్రేమకథా చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైంది. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. తరువాత 'హ్యాపీ వెడ్డింగ్' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లోను చేసింది. అయితే ఈ సినిమా కూడా ఆదరణ పొందలేదు. ఈ నేపథ్యంలో ఆమె తదుపరి సినిమాగా 'సూర్యకాంతం' రూపొందుతోంది. రాహుల్ విజయ్ జోడీగా ఆమె ఈ సినిమాలో కనిపించనుంది. తాజాగా ఈ చిత్రం నుంచి నిహారిక ఫస్ట్ లుక్ విడుదల చేసారు చిత్ర బృందం. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న నిహారికకి ఈ సారైనా హిట్ పడుతుందేమో చూడాలి. ఈ చిత్రాన్ని నూతన సంవత్సరంలో ప్రేక్షకులు ముందుకి తీసుకురానున్నారు.