సింగర్ సోను నిగమ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను పాకిస్థాన్లో పుట్టుంటే కనీసం తనకు భారత్లోనైనా అవకాశాలు వచ్చుండేవని అయన అన్నారు. ఓ ఆంగ్ల మీడియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సోనూ నిగమ్ భారత్లో పాకిస్థాన్ గాయకులకు వస్తున్న అవకాశాల గురించి మాట్లాడుతూ.. ‘ఒక్కోసారి నాకేమనిపిస్తుందంటే.. నేను పాకిస్థాన్లో పుట్టుంటే.. కనీసం భారత్లోనైనా అవకాశాలు వచ్చుండేవి. ఈరోజుల్లో గాయకులే డబ్బులు చెల్లించి కార్యక్రమాల్లో పాటలు పాడాల్సి వస్తోంది. లేకపోతే వేరే దేశాలకు చెందిన గాయకుల చేత పాడించి హైలైట్ చేస్తున్నారు. అలా వారు సొమ్ము చేసుకుంటున్నారు’ అని అయన అసంతృప్తి వ్యక్తం చేసారు.