YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

సూరి హత్యకేసులో భానుకిరణ్ కు యావజ్జీవం

 సూరి హత్యకేసులో భానుకిరణ్ కు యావజ్జీవం
ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నాంపల్లి కోర్టు భానును దోషిగా తేల్చింది. భానుకు యావజ్జీవ శిక్ష విధిస్తూ రూ.20వేల జరిమానాను కోర్టు విధించింది. ఇదే కేసులో మరో నిందితుడు మన్మోహన్ సింగ్ కు ఐదేళ్ల శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించింది. మరో మిగతా నలుగురిపై కేసును కోర్టు కొట్టివేసింది. మొత్తం ఆరుగురిలో ఇద్దరిని కోర్టు దోషులుగా తేల్చింది. మిగతా నలుగురు  సుబ్బయ్య, వంశీధర్, వెంకటరమణ, హరిలను నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది. 2011 జనవరి 3వతేదీన భాను చేతిలో ఫ్యాక్షనిస్టు గంగుల సూర్య నారాయణరెడ్డి అలియాస్ సూరి హత్యకు గురయ్యాడు. సూరి కారులో వెళ్తుండగా భానుకిరణ్ తుపాకీతో కాల్చి పరారయ్యాడని మధుమోహన్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.  ఈ ఘటన అనంతరం భానుకిరణ్ పారిపోవడంతో అతనిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసును మొదట బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేసి, తర్వాత సీఐడీకి అప్పగించారు.  2012లో భానుకిరణ్ ను జహీరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. ఏడేళ్ల పాటు సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. నాంపల్లి కోర్టు 92 మంది సాక్షులను విచారించింది. సూరి డ్రైవర్ వాంగ్మూలం, భానుకిరణ్ వాడిన తుపాకీ, కాల్ డేటా ఆధారంగా కోర్టు భానును దోషిగా తేల్చింది. నిందితుడు భానుకిరణ్ ప్రస్తుతం మరో కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తుపాకుల అక్రమ తయారీ కేసులో అతడితోపాటు మరో ముగ్గురికి నాంపల్లి కోర్టు శిక్షను ఖరారుచేసింది. కోర్టు తీర్పుపై సూరి సతీమణి గంగుల భానుమతి హర్షం వ్యక్తం చేశారు.

Related Posts