వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 130 అసెంబ్లీ, 20 లోక్సభ స్థానాలు వస్తాయని ఎంపీ కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పతనం మొదలైందని, మూడు రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. మోదీని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధమయ్యారని కేశినేని నాని వ్యాఖ్యానించారు. రాఫెల్ డీల్‌పై ఇంకా అనుమానాలు ఉన్నాయన్నారు. యూపీఏ హయాంలో జరిగిన రాఫెల్ డీల్‌కు మోదీ హయాంలో జరిగిన డీల్‌కు మధ్య వ్యత్యాసం ఉందని ఎంపీ కేశినేని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం సీఎం చంద్రబాబును ఎంపీ కేశినేని నాని కలిశారు. ఈ సందర్భంగా తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను సీఎంకు ఎంపీ అందజేశారు.