YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఒకప్పటి అగ్రదర్శకుల కథ ముగిసినట్టేనా..!!

 ఒకప్పటి అగ్రదర్శకుల కథ ముగిసినట్టేనా..!!

 ఒకప్పటి టాప్ డైరెక్టర్లు ఇప్పుడు ఏమైపోయారు. చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి పెద్ద స్టార్ లకు భారీ విజయాలు ఇచ్చినా దర్శకులకు ఇప్పుడు సినిమాలు ఇచ్చే హీరోలే కనిపించట్లేదు. 'ఆది', 'ఠాగూర్' వంటి భారీ విజయాలు తీసిన వీ.వీ వినాయక్ ప్రస్తుతం వరుస ప్లాపులలో ఉన్నారు. చిరంజీవి తో చేసిన "ఖైదీ నెం 150"  చిత్రం తో ఆయనకు ఆఖరి విజయం దక్కింది. ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించిన ఆ క్రెడిట్ అంత చిరంజీవికే దక్కింది. వినాయక్ తన ఆఖరి చిత్రం సాయి ధరమ్ తేజ్ తో 'ఇంటెలిజెంట్' చేశారు. ఈ చిత్రం డిసాస్టర్ అయింది. ఈ చిత్రం తరువాతో వినాయక్ మరో చిత్రాన్ని పట్టాలు ఎక్కించలేదు.  అలాగే పోకిరి, బిజినెస్ మెన్ తో మహేష్ బాబు  కి స్టార్ డాం తెచ్చిన దర్శకుడు పూరీజగన్నాధ్. ఈ దర్శకుడు చేసిన చిత్రాలు అన్ని యూత్ ని బాగా ఆకర్షిస్తాయి. పూరి కి 2015 లో వచ్చిన "టెంపర్" చిత్రమే ఆఖరి విజయం. తరువాత బాలకృష్ణ వంటి పెద్ద స్టార్లతో సినిమాలు చేసిన విజయం సాధించలేకపోయారు. ఎవరు సినిమాలు ఇవ్వక తన కొడుకుతో "మెహబూబా" అనే చిత్రం తీసి చేతులు కాల్చుకున్నాడు. పూరి కూడా ప్రస్తుతం ఏ చిత్రాన్ని స్టార్ట్ చేయకపోవడం గమనించవలిసిన విషయం. ఇక మరో దర్శకుడు శ్రీను వైట్ల దగ్గరకు వస్తే మొదటి నుంచి కామెడీతోనే ఎన్నో విజయాలు సాధించారు. వరుస ప్లాపులతో మహేష్ కెరీర్ స్లో గా ఉన్న సమయం లో "దూకుడు" వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఇచ్చారు శ్రీను వైట్ల. ఈ చిత్రం మొత్తం కామెడీ ఎంటర్టైనర్ గానే తెరకెక్కిచిన శ్రీను వైట్ల తన తరువాత చిత్రాలలో కూడా అదే పంధా కంటిన్యూ చేసారు. ఎన్ని ప్లాపులు వచ్చిన శ్రీను వైట్లకి పెద్ద హీరోలు అవకాశాలు ఇవ్వడం మానలేదు.. కానీ ఆ అవకాశాలను వినియోగించుకోవడం లో ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు శ్రీను వైట్ల. మరోవైపు హరీష్ శంకర్, బి.వీ.ఎస్ రవి, సంపత్ నంది, గోపీచంద్ మలినేని ఇలా కమర్షియల్, కామెడీ ఫార్ములానే నమ్ముకున్న దర్శకులు ఇప్పుడు వరుస పరాజయాలతో ఉన్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు, ప్రేక్షకులు అందరు కొత్త కథలను, కొత్త దర్శకులను ప్రోత్సహిస్తున్నారు. మరి ఈ కమర్షియల్ దర్శకులు తమ పంథాను మార్చుకుని కొత్త కథలను రాసి ఎప్పుడు సక్సస్ అవుతారో చూడాలి.

Related Posts