YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
ఆయిల్ మార్కెట్ కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరలను మరోసారి సవరించడంతో మంగళవారం (డిసెంబరు 18) దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.70.63 కి చేరింది. డీజిల్ ధర 7 పైసలు పెరిగి రూ.64.54 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలోనూ 10 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.76.25 కి చేరింది. డీజిల్ ధర 8 పైసలు పెరిగి రూ.67.55 కి చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయాన్నికొస్తే.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 11 పైసలు పెరిగి రూ.74.91, డీజిల్ ధర 7 పైసలు పెరిగి రూ.70.14 కి చేరింది. విజయవాడలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.74.40, డీజిల్ ధర రూ.69.28 గా ఉన్నాయి. 

Related Posts