YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ ఉద్యమంతో ఏమాత్రం సంబంధంలేనివాళ్లు కేబినెట్‌లో

తెలంగాణ ఉద్యమంతో ఏమాత్రం సంబంధంలేనివాళ్లు కేబినెట్‌లో

 టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

ఉద్యమంతో ఏమాత్రం సంబంధంలేనివాళ్లు తెలంగాణ కేబినెట్‌లో ఉన్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఆ విషయం తలుచుకుంటే కళ్లవెంట నీళ్లు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం వెనుక బలమైన కారణం ఉందని భావిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగులు లేనిదే సకలజనుల సమ్మె లేదని, తెలంగాణ లేదని అన్నారు. అప్పుడు తెలంగాణ కోసం పనిచేయని వాళ్ళు ఇప్పుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంపై స్వపక్షం నుంచే విమర్శల పరంపర కొనసాగుతోంది. నాడు కేసీఆర్‌ను తిట్టినవారే నేడు ఆయన కేబినెట్‌లో కొనసాగుతున్నారని రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి నాయిని చేసిన వ్యాఖ్యలు వందశాతం సరైనవని శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

 

Related Posts