ఈనెల 19వ తేదీన ఎల్ ఇ యమ్ స్కూల్ గ్రౌండ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమి క్రిస్మస్ వేడుకలు. జరగనున్నాయి. మంగళవారం నాడు ఆ ఏర్పాట్లను మంత్రి నక్కా ఆనందబాబు, కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ విజయరావు పరిశీలించారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు ముఖ్యఅతిధిగా పాల్గొంటున్నారు. వేడుకల స్థలాన్ని పరిశీలించిని మంత్రి అనందబాబు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సెమి క్రిస్మస్ వేడుకలకు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది.. రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ సంఘాల ప్రతినిధులు హాజరవుతారని మంత్రి వెల్లడించారు.