తుపాన్ పీడిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు ఏరియల్ సర్వే నిర్వహించారు. తరువాత భైరవపాలెం చేరుకుని తుఫాను బాధితులతో మాట్లాడారు. తుఫాన్ వల్ల ఒక్కరు కూడా చనిపోకుండా కాపాడుకోగలిగామన్నారు. ముందస్తు చర్యలు పగడ్బందీ గా తీసుకున్నామన్నారు. సెల్ టవర్లు అన్నీ సక్రమంగా పని చేసేలా చేయగలిగామని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అందిస్తున్నామన్నారు. తుఫాన్ వల్ల ఒక్కరు కూడా చనిపోకుండా కాపాడుకోగలిగామన్నారు. భైరవపాలెం లో అందరికీ పక్కా ఇళ్లు కేటాయిస్తున్నామన్నారు. సముద్రంలో వేటకు వెళ్లలేక పోయిన మత్స్యకారుల కి 2వేల రూపాయల విలువైన ప్యాకేజ్ అందిస్తున్నామన్నారు. గుజరాత్ కు చెందిన జి ఎస్ పి సి వల్ల మత్స్యకారులకు అన్యాయం జరిగింది. మోడీ మోసాల వల్ల ఓన్జీసీ కూడా నష్టాల్లో మునిగేలా ఉంది. తుఫాన్ తీరం దాటిన ప్రాంతంలో బాధితులను పరామర్శించేందుకు వచ్చానని అన్నారు. ౧996లో కూడా హెరికెన్ తుఫాన్ వచ్చినప్పుడు వెంటనే వచ్చాను. హుద్ హుద్,తిట్లీ వచ్చినప్పుడు కూడా వెంటనే స్పందించాను. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న imd ఇవ్వలేని సమాచారం మన సొంత వ్యవస్థ ద్వారా ఇచ్చామని అయన అన్నారు. తుఫాన్ వచ్చినా, కరువు వచ్చినా అభివృద్ధి ఆగదు. ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. విభజన హామీలు అమలు చేయలేదు. తుఫాన్, కరువు వచ్చినా కేంద్రం సహకరించడం లేదు. హుద్ హుద్ కి వెయ్యి కోట్లు ఇస్తామని 650 కోట్లు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. కేంద్రం సహకరించకపోయినా ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఆగవు. ప్రజల కోసం24గంటలు పని చేసే ప్రభుత్వం టీడీపీ ది. మత్స్యకారులు ఎప్పుడూ టీడీపీ కి అండగా ఉన్నారని చంద్రబాబు అన్నారు.