ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు ఆర్.కె. లక్ష్మణ్ పై ఆధారితమైన ‘‘టైమ్లెస్ లక్ష్మణ్’’ గ్రంథాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ, కాలం అనే సరిహద్దు లేనటువంటి ప్రయాణం లో ఒక భాగం అయినందుకు తాను సంతోషిస్తున్నట్లు చెప్పారు. లక్ష్మణ్ కృతుల అపార ఖజానా లోకి తొంగి చూసేందుకు ప్రస్తుతం ఒక అవకాశం లభ్యం కావడం పట్ల ఆయన హర్షాన్ని వెలిబుచ్చారు. దశాబ్దుల గుండా సాగినటువంటి లక్ష్మణ్ కృతుల ను అధ్యయనం చేయడం అప్పటి సామాజిక, ఆర్థిక స్థితిగతులను, ఇంకా సామాజికీకరణాన్ని అర్థం చేసుకొనేందుకు ఒక చక్కని మార్గం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రయత్నం ఒక్క లక్ష్మణ్ గురించో, లేదా ఆయన ను స్మరించుకోవడానికో చేసిన ప్రయత్నం కాదని, లక్ష్మణ్ లోని ఒక చిన్న భాగం కోట్లాది ప్రజల లో ఇప్పటికీ మనుగడ సాగిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు.
లక్ష్మణ్ ఆలంబనగా తీసుకున్న సగటు మనిషి కాలం అనే ఎల్ల లేని వాడని, భారతదేశం అంతటా అతడి ఉనికి ఉందని ప్రధాన మంత్రి చెప్పారు. భారతదేశం లో నివసించేవారు వారందరూ, మరి అలాగే అన్ని తరాలకు చెందిన ప్రజలు ఆయన తో మమేకం కాగలుగుతారని మోదీ అన్నారు. పద్మ పురస్కారాల ప్రక్రియ ను ఏ విధం గా సామాన్య మానవుడి పట్ల శ్రద్ధ వహించేటట్టు మార్పు చేయడం జరిగిందో ప్రధాన మంత్రి తన ప్రసంగం లో ప్రస్తావించారు.