అంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఉదయం సచివాలయంలో జరుగనుంది. కేబినెట్ లోకి కొత్తగా ఇద్దరు మంత్రులను తీసుకున్న అనంతరం జరిగే తొలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రధానంగా సంక్షేమ పథకాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైతు రుణమాఫీ, అగ్రిగోల్డ్ వ్యవహారం, జర్నలిస్టుల గృహనిర్మాణం, పలు సంస్థలకు భూముల కేటాయింపు తదితర అంశాలు కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశముంది. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉదయం 11.30 గంటలకు మంత్రిమండలి సమావేశం ప్రారంభంకానుంది. కేబినెట్లో ప్రవేశపెట్టే అజెండాను రూపొందించడంలో అధికారులు నిమగ్నమయ్యారు.