పెథాయ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర చలిగాలులు విస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్, భద్రాచలం, భూపాలపల్లి ,జగిత్యాల, మంచిర్యాల ,నిర్మల్ ,కొమురం భీం అసిఫా బాద్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్ లు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మందులు ,దుస్తులు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి తెలిపారు. జిల్లా కలెక్టర్ లు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవసరమైన సహాయసహకారాలు అందించాలని సీఎస్ అన్నారు. జిల్లా యంత్రాంగం ఈ అంశం పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ విషయమై జిల్లా ప్రజా ప్రతినిధులు , స్వచ్చంద సంస్థల సహాయ సహకారాలు తీసుకోవాలని కలెక్టర్లను సి.యస్ ఆదేశించారు.