ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధమైంది. జైపూర్‌లో 70 మంది క్రికెటర్ల కోసం 8 ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. ఈ వేలం ప్రక్రియలో 119 మంది క్యాప్‌డ్ ప్లేయర్లు, 229 మంది అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం ఆటగాళ్లలో 228 మంది భారత క్రికెటర్లు ఉండటం గమనార్హం. వాస్తవానికి ఈ వేలం ప్రక్రియ కోసం 1003 ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకోగా.. ఈ జాబితాను 346కి కుదించారు. చివర్లో ఐదుగురు ఆటగాళ్లు ఎంట్రీ ఇవ్వడంతో మొత్తం ఆటగాళ్ల సంఖ్య 351కి చేరింది. వీరి నుంచి ఫ్రాంచైజీలు 70 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి. * వేలం ప్రక్రియ ప్రారంభం.. తొలి ఆటగాడు మనోజ్ తివారి. అతడి ప్రాథమిక ధర రూ.50 లక్షలు, కాగా ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. వేలం ప్రక్రియలో రెండో ఆటగాడు పుజారా. అతడి ప్రాథమిక ధర రూ.50 లక్షలు, కాగా ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. మూడో ఆటగాడు అలెక్స్ హేల్స్. అతడి ప్రాథమిక ధర రూ.1.50 కోట్లు, కాగా ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారీని దక్కించుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ రూ.50 లక్షలకు బిడ్ వేసింది. ముంబైతో పోటీ పడిన ఢిల్లీ అతణ్ని రూ.2 కోట్లకు దక్కించుకుంది. షిమ్రాన్ హెట్మెయర్‌ను రూ. 4 .20 కోట్లకు దక్కించుకున్న బెంగళూరు. బ్రెండన్ మెక్‌కల్లమ్, మార్టిన్ గప్టిల్, క్రిస్ వోక్స్ పట్ల ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు. ఆల్‌రౌండర్, విండీస్ కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్‌ను రూ.5 కోట్లకు కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్. గత ఏడాది బ్రాత్‌వైట్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్. క్రిస్ జోర్డాన్‌ను కొనేందుకు ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు. గురు కీరత్ సింగ్‌ను కొనుగోలు చేసిన ఆర్సీబీ. ప్రాథమిక ధరను తగ్గించుకున్నా.. యువరాజ్ సింగ్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు. హెన్రిక్యూస్‌ను రూ.1 కోటికి దక్కించుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్. అక్షర్ పటేల్ కోసం ఢిల్లీ, పంజాబ్ పోటాపోటీ. రూ.5 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్. జానీ బెయిర్‌స్టోను రూ.2.2 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్. వెస్టిండీస్ వికెట్ కీపర్ నికోలస్ పూరాన్‌ను రూ.4.2 కోట్లకు కొనుగోలు చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్. వృద్ధిమాన్ సాహా కోసం బిడ్ వేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్. రూ.1.20 కోట్లకు కొనుగోలు చేసిన హైదరాబాద్. గత సీజన్లో రూ.11.5 కోట్లు పలికిన జయదేవ్ ఉనద్కత్. ఈ ఏడాది రూ.1.5 కోట్ల ప్రాథమిక ధరతో వేలానికి. పోటీ పడిన ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్. రూ.5 కోట్లకు చెన్నై సూపర్ కింగ్ బిడ్. రూ. 6.2 కోట్లకు బిడ్ వేసిన కింగ్స్ ఎలెవన్. రూ.8.4 కోట్లకు తిరిగి దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్. ఇషాంత్ శర్మను రూ.1.10 కోట్లకు సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్. లంక పేసర్ లసిత్ మలింగను రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్. వరుణ్ ఆరోన్‌ను రూ.2.40 కోట్లకు దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్. అత్యధిక బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు ఉండగా.. ఈ కేటగరిలో 10 మంది ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. అత్యధిక ధర ఉన్న ఈ కేటగిరీలో ఒక్క భారత ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం. రూ.1.5 కోట్ల బేస్ ప్రైజ్ కేటగిరీలో 10 మంది ఆటగాళ్లు ఉండగా.. భారత్ నుంచి జయదేవ్ ఉనద్కత్ మాత్రమే ఈ జాబితాలో ఉన్నాడు. కోటి రూపాయల కేటగిరీలో 19 మంది ఆటగాళ్లు ఉండగా.. యువీ సహా నలుగురు భారత ఆటగాళ్లు ఈ కేటగిరీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.