జగన్ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. అక్కడి నుంచి చల్లవానిపేట, సౌదాం, రేగులపాడు క్రాస్, కొప్పాలపేట క్రాస్, దుప్పాలపాడు క్రాస్, గంగుపేట, కస్తురిపాడు జంక్షన్ మీదుగా కొబ్బరిచెట్ల పేట వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. టీడీపీ ప్రభుత్వ నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలను దోచుకున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. కింది స్థాయి నేత నుంచి పెదబాబు వరకు అంతా దోపిడీలో భాగస్వాములేనని ఆరోపించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు రూ.95వేల కోట్ల అప్పులు ఉంటే దాన్ని రూ1.25 లక్షలకు పెంచి, టీడీపీ పెద్దలు మాత్రం తమ ఆస్తులు పెంచుకున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై టీడీపీ నాయకులు మొ దటి నుంచీ వివక్ష చూపిస్తూనే ఉన్నారని తెలిపారు. మండువేసవిలోనూ నీరు ఇచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో చదువుకున్న వారికి ఎవరికీ ఉద్యోగాలు రావడం లేదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని టీడీపీ నిర్వీర్యం చేస్తుంటే దాన్ని బతికించేందుకే పాదయాత్ర చేస్తున్నాని చెప్పారు.