YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎంపీలో 650 కోట్ల రుణమాఫీ

ఎంపీలో 650 కోట్ల రుణమాఫీ
దేశంలో ప్రస్తుతం రుణమాఫీల సీజన్ నడుస్తోంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా రాజకీయ పార్టీలు మొదట ఇచ్చే హామీ రుణమాఫీయే. రైతులు, మహిళలు, అట్టడుగు ప్రజలను ఆకట్టుకునేందుకు పార్టీలకు అంతకుమించిన ఆయుధం లేదనే చెప్పాలి. ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే గ్రామీణ ప్రాంతాల్లో రూ.650కోట్ల విద్యుత్ బకాయిలను రద్దు చేస్తున్నట్లు గుజరాత్ ప్రకటించింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్ సోమవారం ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మార్చి 31, 2018 నాటికి రూ.2లక్షల వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. ఆ వెంటనే రాష్ట్రంలోని 1.66 మిలియన్ల రైతులకు ప్రయోజనం కలిగేలా రూ.6,100 కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భాగల్ ప్రకటించారు. రైతు రుణమాఫీ అంశంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మంగళవారం కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. రైతులు, సామాన్యులను ఆదుకోవడంతో మోదీ సర్కారు పూర్తిగా విఫలమైందంటూ విమర్శలు గుప్పించారు. పార్లమెంటు వేదికగా ప్రతిపక్ష పార్టీలూ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున మోదీ సర్కారుకు ఈ విమర్శలు గుడిబండగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనూ రైతు రుణమాఫీ చేయాలని పటేదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ డిమాండ్ చేస్తున్నారు

Related Posts