YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

యువరాజ్ పై నిరాశక్తి

యువరాజ్ పై నిరాశక్తి
సీజన్ ఆటగాళ్ల వేలంలో భారత వెటరన్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కి నిరాశే ఎదురైంది. జైపూర్ వేదికగా ఈరోజు జరుగుతున్న వేలంలో రూ. కోటి కనీస ధరతో వేలంలోకి వచ్చిన యువరాజ్ సింగ్‌ని కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి కనబర్చలేదు. దీంతో.. తొలి విడత అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో ఈ ఆల్‌రౌండర్ చేరిపోయాడు. 2015 ఐపీఎల్‌ వేలంలో రూ. 16 కోట్లకి అమ్ముడుపోయి రికార్డులు నెలకొల్పిన యువరాజ్ సింగ్.. గత మూడు సీజన్లలోనూ అంచనాల్ని అందుకోలేకపోయాడు. దీంతో.. గత ఏడాది రూ.2 కోట్లకి కొనుగోలు చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ.. అతడి పేలవ ప్రదర్శన కారణంగా మళ్లీ వేలంలోకి విడిచిపెట్టింది. దీంతో.. తన ధరని యువీ అనూహ్యంగా రూ. కోటికి తగ్గించుకున్నా ఫ్రాంఛైజీలు పట్టించుకోలేదు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్ జట్టు గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఈ ఆల్‌రౌండర్‌ వచ్చే ఏడాది ఐపీఎల్‌ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. గత ఏడాదన్నరకాలంగా టీమిండియాకి దూరంగా ఉంటున్న యువీ.. దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నా.. ఫామ్ అందుకోలేకపోయాడు.

Related Posts