YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మారుతోన్న చంద్రబాబు

మారుతోన్న చంద్రబాబు
రాజకీయ చాణక్యుడు చంద్రబాబు ఇక పై పూర్తి అటాకింగ్ మోడ్ లో దూసుకుపోయే వ్యూహమే నమ్ముకున్నారు. ప్రత్యర్థులను ఏ మాత్రం ఉపేక్షించినా మొదటికే మోసం వస్తుందని తెలంగాణ ఎన్నికలు ఆయనకు పాఠం నేర్పాయి. అందుకే తాజాగా ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన వారం తరువాత కూడా చంద్రబాబు తెలంగాణ సీఎం ను టార్గెట్ చేస్తూ మాటల తూటాలు విడిచిపెట్టారు. తాను హరికృష్ణ భౌతికయాయం దగ్గర పొత్తు మాటలు మాట్లాడినట్లు వైసిపి చేస్తున్న ప్రచారం పై విరుచుకుపడ్డారు. తాను మాట్లాడింది ఒకటైతే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.టీఆర్ఎస్ తో విభేదాలు ఉన్నా కలిసి నడవాలని అనుకున్నది దేశ రాజకీయాల్లో తెలుగు ప్రజలు శాసించాలని భావించడమేనని తేల్చారు ఎపి చంద్రుడు. అయితే కేంద్రంపై పోరాటానికి కెసిఆర్ కలిసి రాకపోవడంతో మహాకూటమి ఏర్పాటు చేయాలిసివచ్చిందని వివరించారు. ఆ విషయాన్నీ వక్రీకరించి మరోరకంగా ప్రచారం చేయడాన్ని బాబు తప్పుపట్టారు. కెసిఆర్ కి రాజకీయ భిక్ష పెట్టిన టిడిపి తెలంగాణ లో ఉండకూడదని బిజెపి మాత్రం ఉండొచ్చా అని ప్రశ్నించారు చంద్రబాబు.వచ్చే ఎన్నికల్లో బిజెపి ఏపీలో పూర్తిగా కనుమరుగు అవుతుందని జోస్యం చెప్పారు ఆయన. ఏపీలో తిరిగి అధికారంలోకి టిడిపి రావడం ఖాయమని ఎపి ప్రయోజనాలకోసమే కేంద్రం పై పోరాటం కొనసాగుతుందని తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం. మోడీ నుంచి కేసీఆర్ వరకు ఇక ఎవరిని ఉపేక్షించినా తేడా కొడుతుందని డిసైడ్ అయిన బాబు పూర్తిగా ఇప్పుడు తన మెతక వైఖరిని పక్కన పెట్టడం కొత్త పరిణామం

Related Posts