రాజకీయాలలో, సినిమాలలో సమర్ధవంతురాలిగా జయలలిత ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత జీవితచరిత్రను ధారావాహికగా తీయడానికి గౌతమ్ మీనన్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఆయనే దర్శకత్వం చేస్తాడా .. నిర్మాతగా మాత్రమే ఉంటాడా? అనే విషయంలో స్పష్టత లేదు గానీ, అందుకు సంబంధించిన సన్నాహాలు మాత్రం చకచకా జరిగిపోతున్నాయట. 30 ఎపిసోడ్స్ గా ఈ ధారావాహిక వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రసారమవుతుందని అంటున్నారు. జయలలిత పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నట్లు సమాచారం.