అల్లు అరవింద్ పెద్ద కొడుకైన బాబీ తండ్రి మాదిరిగానే సినిమా నిర్మాణం పట్ల ఆసక్తిని చూపుతున్నాడు. తొలి సినిమాను వరుణ్ తేజ్ తో చేయనున్నట్టు తెలుస్తోంది. క్రీడల నేపథ్యంలో సాగే ప్రేమ కథాంశంతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. కిరణ్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతాడని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. అల్లు అరవింద్ చిరంజీవి కుటుంబంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తో సినిమాలు నిర్మించారు. కానీ వరుణ్ తేజ్ తో ఒక సినిమా కూడా నిర్మించలేదు. ప్రస్తుతం ఆ బాధ్యత అల్లు బాబీ తీసుకున్నాడు. మరి తండ్రి లా బాబీ కూడా నిర్మాణ రంగంలో ఎంతవరకు విజయం సాధిస్తాడా చూడాలి.