YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

హాట్‌కేకులా హువాయి స్మార్ట్‌ఫోన్‌

హాట్‌కేకులా హువాయి స్మార్ట్‌ఫోన్‌

హువాయి తాజాగా విడుదల చేసిన హానర్‌ 9 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ హాట్‌కేకులా అమ్ముడుపోయింది. ఫ్లిప్‌కార్ట్‌లో మంగళవారం మధ్యాహ్నం ఫ్లాష్‌ సేల్‌లో అమ్మకానికి పెట్టగా రికార్డుస్థాయిలో  ఫోన్లు అన్నీ అమ్ముడైపోయాయి. మార్కెట్‌లో పోటీ ఎక్కువ ఉన్నప్పటికీ తమ ఫోన్‌కు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని హువాయి కన్జుమర్‌ బిజినెస్‌ గ్రూప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పి. సంజీవ్‌ తెలిపారు. సరసమైన ధరలో అత్యాధునిక ఫీచర్లు అందించడం వల్లే హానర్‌ 9 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ సక్సెస్‌కు కారణమని వివరించారు. ముందు, వెనుక డ్యుయల్‌ కెమెరాలు ఈ ఫోన్‌ ప్రత్యేకత.

హానర్‌ 9 లైట్‌ ఫీచర్లు
5. 65 అంగులాల డిస్‌ప్లే
కిరిన్‌ 659 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో
3 జీబీ ర్యామ్‌ 32 జీబీ/256 జీబీ స్టోరేజ్‌
13 ఎంపీ+2 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
13 ఎంపీ+2 ఎంపీ డ్యుయల్‌ ఫ్రంట్‌ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ధర రూ. 10,999

Related Posts

To Top