YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జయలలిత 75 రోజుల వైద్యానికి అయిన ఖర్చు అక్షరాలా రూ. 6.85కోట్లు.

జయలలిత 75 రోజుల  వైద్యానికి అయిన ఖర్చు అక్షరాలా  రూ. 6.85కోట్లు.
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి  జయలలిత 75 రోజుల పాటు వైద్యానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా..అక్షరాలా  రూ. 6.85కోట్లు. ఇందులో ఆహార ఖర్చులే రూ. 1.17కోట్లుగా ఉన్నాయి. జయలలిత తన చివరి రోజుల్లో దాదాపు రెండున్నర నెలలు ఆసుపత్రిలో ఉన్నారు.  ఈ మేరకు అమ్మ మృతిపై దర్యాప్తు చేస్తున్న విచారణ కమిటీకి అపోలో యాజమాన్యం ఇటీవల ఇచ్చిన నివేదికలో ఈ వివరాలను పేర్కొన్నారు. ఈ నివేదిక బయటకు లీకై ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది.2016 సెప్టెంబరు 22న జయలలిత అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి 75రోజుల పాటు చికిత్స పొందిన అమ్మ.. అదే ఏడాది డిసెంబరు 5న తుదిశ్వాస విడిచారు. అమ్మ వైద్యానికి రూ. 6.85కోట్లు ఖర్చయినట్లు ఆసుపత్రి తమ నివేదికలో పేర్కొంది. ఇందులో ఆహారం, పానీయాలకు రూ. 1.17కోట్లు అయినట్లు తెలిపింది. యూకేకు చెందిన డాక్టర్ రిచర్డ్ బేలేకు రూ. 92లక్షలు చెల్లించారు.జయలలిత మరణించిన కొన్ని నెలల తర్వాత 2017 జూన్ 15న అన్నాడీఎంకే పార్టీ రూ. 6 కోట్లను ఆసుపత్రికి చెల్లించింది. అంతకుముందు అమ్మ ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే రూ. 41.13లక్షలు చెల్లించాలి. ఇంకా రూ. 44.56లక్షలు చెల్లించాల్సి ఉందని అపోలో నివేదికలో పేర్కొంది.విచారణ కమిటీకి అపోలో ఆసుపత్రి అందించిన నివేదిక ఇటీవల బయటకు లీకై సోషల్మీడియాలో వైరల్గా మారింది. అయితే తమ వల్ల నివేదిక బయటకు పొక్కలేదంటూ అటు విచారణ కమిటీ, ఇటు ఆసుపత్రి యాజమాన్యం చెబుతున్నాయి. ‘ఇది ఎంతో రహస్యమైన నివేదిక. దీన్ని మేం నవంబరు 27నే కమిటీకి అందించాం. నివేదిక లీకైందని తెలిసి షాక్కు గురయ్యాం. ఎలా జరిగిందన్నదానిపై ఆరా తీస్తున్నాం’ అని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.

Related Posts