శ్రీకాకుళం జిల్లా, టెక్కలి నియోజకవర్గం, కోటబొమ్మాళి మండలంలోని కొబ్బరిచెట్లపేట శివారులోని శిబిరం నుంచి ప్రతిపక్ష నేత, జగన్ మోహన్ రెడ్డి యాత్ర ప్రారంబమయింది. .ఉదయాన్నే శిబిరం వద్దకు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు. అభిమానులు తరలివచ్చారు. కోటబొమ్మాళి మండలం ఆర్.హెచ్.పురం మాజీ సర్పంచ్లు యెన్ని జ్యోతి, యెన్ని మన్మధరావు, యెన్ని మాధవరావు తదితరులు జననేత సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఆ తర్వాత పాదయాత్ర జరజంగి చేరుకోగా జననేతను కలిసి స్థానిక హైస్కూల్ విద్యార్ధులు తమ సమస్యలు వివరించారు. పాఠశాలలో కనీస వసతులు లేవని, ప్రహారీ లేకపోవడంతో పశువులకు నెలవుగా మారిందని, స్కూల్లో కంప్యూటర్లున్నా బోధించేవారు లేరని.. మరోవైపు సిబ్బంది కొరత కూడా ఉందని విపక్షనేతకు వివరించారు. ఆ రూట్లో బస్సుల సక్రమంగా నడపడం లేదని, దీంతో వాటి కోసం ఎదురుచూడకుండా సైకిళ్లపై కాలేజీకి వెళ్తున్నామని విద్యార్థినిలు పేర్కోన్నారు. అనంతరం అక్కయ్యవలస క్రాస్ మీదుగా కొత్తపేటకు చేరుకున్న వైయస్ జగన్కు గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. గ్రామంలో పాదయాత్ర సందర్భంగా జననేతను కలిసిన యలమంచిలి సర్పంచ్ అమ్ములమ్మ, వైస్ సర్పంచ్ ఫాల్గునమ్మతో పాటు, ఆ ఊరి ప్రజలు. తాము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులం కావడంతో మంత్రి అచ్చెన్నాయుడు కక్ష సాధిస్తున్నారని వారు ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు.