తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను పునర్నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అయన త్వరలో పదవీ బాధ్యతల స్వీకరణ చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి వెంకటవీరయ్య టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉండగా.. నిబంధనల మేరకు.. ఆయన అప్పటికే తనకున్న ధర్మకర్తల మండలి సభ్యుడి పదవికి రాజీనామా చేశారు. తరువాత అయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.