ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన దూదేకులకు రాజకీయంగా ప్రధాన్యత కల్పించాలని ఏపి మైనారిటీ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ అన్నారు. దూదేకుల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తోందని ఫరూక్ తెలిపారు. రాజధాని అమరావతిలోని మందడం గ్రామంలో ఏపి దూదేకుల పొలిటికల్ జెఏసి రాష్ట్ర కార్యాలయాన్ని మంత్రి ఫరూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ దూదేకుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఫెడరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల జనాభ ఉన్న దూదేకులను అన్ని రాజకీయ పార్టీలు రాజకీయంగా ఉపయోగించుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం దూదేకుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రాజకీయ ప్రధాన్యతనిస్తామని హామీ ఇచ్చారు. ముస్లి దూదేకుల పొలిటికల్ జెఏసి ఏర్పడటం శుభ పరిణామం అని ... అన్ని దూదేకుల సంఘాలు పొలిటికల్ జెఏసి గొడుగు క్రిందకు వచ్చి పనిచేయాలని సూచించారు. అప్పుడే దూదేకుల బలం రాజకీయ పార్టీలకు తెలుస్తుందన్నారు. దూదేకుల పొలిటికల్ జెఏపి రాష్ట్ర అధ్యక్షులు దస్తగిరి ని మంత్రి ఫరూక్ అభినందించారు. దస్తగిరి మంచి ఆశయాలతో మందుకు వెడుతున్నాడని తమ సహకారం కూడా ఆయనకు ఉంటుందన్నారు.
వైసిపి నాయకుల లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ఇప్పటిదాకా దూదేకులను ఓటు బ్యాంక్ గానే చూశారని ఆ పరిస్థితి పోవాలన్నారు. దూదేకుల సమస్యను తమ నాయకులు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసకవెడతామన్నారు. వైసిపి మ్యానిఫెస్టోలో దూదేకులకు ప్రాధాన్యతనిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పాలనలో దూదేకులకు ఏమాత్రం న్యాయం జరగులేదని ఆరోపించారు. దూదేకుల పొలిటికల్ జెఏసి పోరాటాలకు వైసిపి సహకారం ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమానికి దూదేకుల ఫెడరేషన్ చైర్మన్ బాబాన్,గుంటూరు జిల్లా వైస్పీ పార్లమెంట్ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్యెల్యే ముస్తఫా,తాడికొండ వైసిపి తాడికొండ సమన్వకర్త శ్రీదేవి,నూర్భాష మైనార్టీ సంక్షేమ వర్కింక్ ప్రెసిడెంట్ దత్తేశ్వర్, వైసిపి డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు మెహెబూబ్, ఇతరులు హజరయ్యారు.