YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రకాశంలో తుస్ మనిపించిన పెథాయ్

 ప్రకాశంలో తుస్ మనిపించిన పెథాయ్
పెథాయ్ తుపాన్ తూర్పుగోదావరి జిల్లా కట్రేనకోన దగ్గర సోమవారం తీరం దాటడటంతో ఇటు జిల్లా యంత్రాంగం, అటు అన్నివర్గాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. కాగా తుపాన్ ప్రభావంతో జిల్లాలో ఎలాంటి వర్షాలు కురవకపోవటంతో ప్రధానంగా రైతాంగం తీవ్ర నిరాశకు లోనైందనే చెప్పవచ్చు. తుఫాన్ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ గత రెండురోజుల నుండి హెచ్చరికలు జారీచేసింది. అయినప్పటికీ జిల్లాలో నామమాత్రపు జల్లులు మాత్రమే కురవటంతో రైతులు సాగుచేసిన పంటలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ప్రధానంగా జిల్లావ్యాప్తంగా మిర్చి, పత్తి, పొగాకు, శనగ పంటలను రైతులు సాగుచేశారు. గత కొంతకాలంనుండి జిల్లావ్యాప్తంగా అనావృష్టి పరిస్థితులు నెలకొనటంతో రైతులు వర్షం కోసం వేయికళ్లతో ఎదురుచూశారు. తీరా బంగాళాఖాతంలో పెథాయ్‌తుపాన్ ఏర్పడిందని దీని ప్రభావంతో జిల్లావ్యాప్తంగా విస్తారంగా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపధ్యంలో రైతుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. కాని రైతులను తుపాన్ తీవ్రనిరాశకు గురిచేసిందనే చెప్పవచ్చు. భారీ వర్షాలతో జిల్లాలోని వాగులు, వంకలు, చెరువుల్లోకి భారీగా వర్షపునీరు చేరి రానున్న రోజుల్లో నీటికి ఇబ్బందులు ఉండవన్న అంచనాలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. కానీ తీరా తుపాన్ తుస్ మనిపించటంతో రానున్న రోజుల్లో తాము సాగు చేసిన పంటలకు సాగు నీరు ఏట్లా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.ఇదిలాఉండగా పెథాయ్ తుఫాన్ ప్రభావిత మండలాలైన చినగంజాం, చీరాల, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, వేటపాలెం, గుడ్లూరు, ఉలవపాడు, సింగరాయకొండ, జరుగుమల్లి, టంగుటూరు, కారంచేడు, సంతనూతలపాడు, ఒంగోలు, కందుకూరులకు ప్రత్యేక అధికారులను జిల్లా కలెక్టర్ వి వినయ్‌చంద్ నియమించారు.  జిల్లాలోని కోస్తాతీరప్రాంతాల్లోని మత్స్యకారులను జిల్లా యంత్రాంగం అప్రమ్తతం చేసింది. మత్స్యకారులకు చెందిన పడవులు, తెప్పలు, వలలను సురక్షితప్రాంతాలకు తరలించుకోవాలని యంత్రాంగం హెచ్చరికలు జారీచేసిన నేపధ్యంలో వాటన్నింటిని మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మత్స్యకారులకు, ఇతరులకు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది.

Related Posts