- సుప్రీంకోర్టులో ప్రజా వాజ్యం
కుటుంబ నియంత్రణ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలంటూ సుప్రీంకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జనాభా పెరుగుదలపై తీక్షణంగా దృష్టి సారించాలని, ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనాలనే నిబంధనను కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అనుపమ్ బాజ్‌పాయి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కుటుంబ నియంత్రణ నిబంధనలను పాటించిన దంపతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ఉల్లంఘించినవారికి ప్రభుత్వ సదుపాయాలు, రాయితీలను ఉపసంహరించాలని పిటిషనర్ కోరారు. దంపతులు గరిష్ఠంగా ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనడానికి అనుమతి ఉండాలన్నారు. ఈ తరం ఆలోచనా విధానంలో సరైన మార్పులు తేకపోతే, భావి తరాలు దయనీయ పరిస్థితుల్లో జీవించవలసి వస్తుందని పేర్కొన్నారు.