టెట్ నిర్వహణ లోపాలపై మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అస్తవ్యస్థంగా సెంటర్ల కేటాయించడంపై అసంతృప్తి వెళ్లబుచ్చారు. పక్క రాష్ట్రాల్లో సెంటర్లు కేటాయించడమేంటని అధికారులపై మండిపడ్డారు. తొలిసారి ఆన్‌లైన్‌లో టెట్ నిర్వహిస్తున్నందుకు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించినా తప్పులు జరిగాయన్నారు. వందల కిలోమీటర్ల దూరంలో సెంటర్లు ఎలా కేటాయిస్తారని అధికారులను మంత్రి నిలదీశారు.