వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి రాజ్యసభ లో పోలవరం పై ప్రశ్నలు అడిగారు. కేంద్ర సహాయ మంత్రి స్పందిస్తూ పోలవరం ప్రాజెక్టు లో ఎక్కడా అవకతవకలు జరగలేదని స్పష్టమైన జవాబు ఇచ్చారు. ఈ జవాబు ను వక్రీకరించి సాక్షి లో అభూత కల్పన లు అల్లారని మంత్రి దేవినేని ఉమ అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. పోలవరం నిర్వాసితులు లక్షా 560కుటుంబాలు ఉన్నాయి. పోలవరం చెల్లింపులో అక్రమాలు నిజమే అని మంత్రి చెప్పినట్లుగా సిగ్గులేకుండా రాశారు. పోలవరం కు అత్యున్నత ప్రమాణాలతో నిర్మితమవుతున్న ప్రాజెక్టు గా కేంద్రం అవార్డు ఇచ్చింది. 23 గంటల్లో 16వేల 380 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేసి గిన్నీస్ రికార్డు సాధించాం. ఇప్పటి వరకు మొత్తం 19లక్షల 18వేల 610 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పూర్తి చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలవరం పనులు వేగంగా సాగుతూ అనేక రికార్డు లు సృష్టిస్తున్నాయని అన్నారు. పాండ్యా నేతృత్వంలో ఆరుగురు కమిటీ సభ్యులు వచ్చి పరిశీలిస్తే ఏదేదో వారి పత్రికలో రాశారు. పోలవరం ప్రాజెక్టును .. కేంద్ర ప్రభుత్వ సంస్థలు సైతం అభినందిస్తుంటే.. జగన్ ఓర్వలేకపోతున్నాడు. పోలవరం పూర్తయితే జగన్ కు రాజకీయ మనుగడ ఉండదు. అందుకే పోలవరం అడ్డుకునేందుకు పక్క రాష్ట్రాలకు సమాచారం ఇచ్చి కేసులు వేయిస్తున్నారని అన్నారు. జగన్ రాయిస్తున్న అసత్య కధనాల పై న్యాయపరంగా, చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం. జగన్ తన స్వార్ధం కోసం రైతులు, ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. పోలవరం పూర్తి చేసేందుకు సంస్థలు, అధికారులు, కార్మికులు ఎంతో కష్టపడుతున్నారు. వారందరినీ అవమానించే విధంగా జగన్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎన్ని కుట్ర లు చేసినా.. పోలవరం పూర్తి చేసి తీరుతాం. చంద్రబాబు 28సార్లు పోలవరం ను సందర్శించి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. కేంద్రం నుంచి 3వేల 342 కోట్లు రావాల్సి ఉన్నా ఇంతవరకు ఇవ్వలేదు. ఆర్దికంగా ఇబ్బందులు ఉన్నా.. పనులు ఆగకుండా సిఎం నిధులు కేటాయిస్తున్నారు. నేటి వరకు పోలవరం 62.61 శాతం పనులు పూర్త చేశాం. దేశంలో ఎవరూ చేయని విధంగా సమాచారం మొత్తం ఆన్ లైన్ లో ఉంచాం. ఇంత చేస్తుంటే .. జగన్ సిగ్గు లేకుండా పక్క రాష్ట్రాలతో చేతులు కలుపుతున్నాడని విమర్శించారు. తెలంగాణ లో పోటీ చేయకుండా కేసిఆర్ తో లాలూచి పడింది వాస్తవం కాదా. సిఎం పదవి పిచ్చి పట్టి జగన్ జాతి ద్రోహానికి పాల్పడుతున్నాడు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎర్త్ కం డ్యాం పనులు నిలిపివేయాలని జగన్ కుట్రలు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆనాడు వైయస్ కు అవకాశం వచ్చినా పోలవరం పూర్తి చేయలేదు. ఆనాడు పవర్ ప్రాజెక్ట్ కొట్టేసేందుకు ప్రయత్నించి జగన్ విఫలమయ్యాడు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు ఇవ్వలేదనే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వైసిపి పెట్టాడని అన్నారు. మేము ఇప్పుడు పూర్తి చేస్తుంటే తట్టుకోలేక ఆటంకాలు కలిగించేదుకు కుట్ర చేస్తున్నాడు. పోలవరం పై అసత్యాలను ప్రచారం చేయడం మానుకోకపోతే జగన్ కు ప్రజలు, రైతులే తగిన విధంగా బుద్ది చెబుతారని అన్నారు.