తమిళ నటుడు, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ ని అరెస్ట్ చేసిన పోలీసులు. తమిళనాడులో ఒకేరోజు పలు చిత్రాలు విడుదలకు సిద్ధమైన వేళ నెలకొన్న వివాదం నిర్మాతలకు, నిర్మాతల మండలికి మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీఎఫ్పీసీ కార్యాలయానికి తాళం వేసిన నిర్మాతలు నిన్న తాళం చెవులను పోలీసు స్టేషన్ లో అప్పగించిన సంగతి తెలిసిందే. తన కార్యాలయానికి తాళం వేయడంపై తీవ్రంగా మండిపడ్డ విశాల్, తన అనుచరులతో రోడ్డుపై నిరసనలకు దిగడంతో పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.