కెరీర్ మొదటి నుంచి విభిన్న పాత్రలు, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ వస్తుంది తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్. పందెం కోడి 2' .. 'సర్కార్' చిత్రాల్లో ఆమె నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలను పోషించింది. ఈ పాత్రలు మంచి పేరు తీసుకురావడంతో, అదే తరహా పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. 'మారి 2' సినిమాతో పలకరించనున్న వరలక్ష్మీ శరత్ కుమార్, తొలిసారిగా తెలుగులో ఒక సినిమా చేయడానికి అంగీకరించింది . వరలక్ష్మి తాజాగా తెలుగులో సందీప్ కిషన్.. హన్సిక జంటగా వస్తున్నా ''తెనాలి రామకృష్ణ బీఏబీఎల్" చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది.