YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ట్రస్టు యాజమాన్యంతో అంతర్గత కలహాలు 15 మందిని పొట్టన పెట్టుకున్న వైనం

ట్రస్టు యాజమాన్యంతో అంతర్గత కలహాలు         15 మందిని పొట్టన పెట్టుకున్న వైనం
ట్రస్టు యాజమాన్యంతో అంతర్గత కలహాలు వెరసి15 మంది మృత్యువుకు కారణమైంది.కర్ణాటకలోని చామరాజనగర జిల్లా సుళ్యాడి గ్రామంలోని మారెమ్మ ఆలయం ప్రసాదంలో విషం కలిపిన ఘటనలో 15 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. మరో వంద మందికి పైగా భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు కారకులుగా భావిస్తున్న నలుగురిని కొళ్లేగాల పోలీసులు అరెస్టు చేశారు. ఆలయ ట్రస్టు యాజమాన్యానికి చెడ్డపేరు తీసుకురావాలని ఉద్దేశంతోనే నిందితులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని, ఇందుకోసం 15 బాటిళ్ల పురుగుమందు వినియోగించారని పోలీసులు తెలిపారు.
‘‘ఆలయ ట్రస్ట్‌ అధ్యక్షుడు ఇమ్మడి మహదేశ్వరస్వామి అలియాస్‌ దేవన్న మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారు. గత ఏడాదిగా ట్రస్టు యాజమాన్యంతో దేవన్నకు అంతర్గత కలహాలున్నాయి. వారికి చెడ్డపేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. 2017 నుంచి దేవన్న ఈ ఆలయానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఎన్నో రోజుల నుంచి ప్రణాళికలు రచించి మరీ ఈ నేరానికి పాల్పడ్డారు. ప్రసాదం తయారీ సమయంలో అందులో 15 బాటిళ్ల పురుగుమందును కలిపారు. ఇది గాఢత ఎక్కువ ఉన్న పురుగుమందు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది’’ అని పోలీసులు తెలిపారు.ఈ ఘటన బాధితులు ఇప్పటికీ మైసూర్‌లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం రూ.5 లక్షల వంతున పరిహారాన్ని అందజేసింది. ఈ దుర్ఘటనలో తల్లిదండ్రుల్ని కోల్పోయిన ముగ్గురు బాలికల్ని మంగళూరుకు చెందిన ఆళ్వాస్‌ విద్యా సంస్థ దత్తత తీసుకుంది.

Related Posts