రాష్ట్రంలో ఓటరు సమస్యలను పరిష్కరించేందుకు ఎలక్షన్ కమిషన్ కాల్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్.పి.సిసొడియా అన్నారు. గురువారం నగరంలోని భారతీనగర్ లో 190 ఎలక్షన్ కమిషన్ కాల్ సెంటర్ ను అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ కాల్ సెంటర్ తో ఓటరు ఇబ్బందులు తొలగిపోతాయని, ఎవరైనా తమ ఓటుహక్కు గురించి పోలింగ్ బూత్ సమాచారాన్ని 1950 కాల్ సెటర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ఎన్నికలు వచ్చేవరకూ పదిమంది సిబ్బందితో ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కాల్ సెంటరు పనిచేస్తుందన్నారు. ఎన్నికల సమయంతో 24గంటలూ మూడు షిప్టులతో పనిచేస్తుందన్నారు. ఎవరైనా తమ ఓటుహక్కు గురించి తెలుపుకోవాలను కునేవారు ఎన్నికల సమస్యల పై ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. దీనికోసం 30 లైన్స్ తీసుకున్నామని, 1950 టోల్ ప్రీ నెం ఒక ప్రత్యేక గుర్తింపు రాజ్యాంగబద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఓటర్లు తమ ఓటుహక్కు గురించి , ఓటునమోదు గురించి ఎవరికి ఫోన్ చేయాలో, ఎవరిని అడగాలో తెలియడం లేదన్న ఉద్దేశ్యంతో ఈ కాల్ సెంటరును రాష్ట్రంలో ఏర్పాటు చేసామన్నారు. ఓటు హక్కు గురించి తెలుసుకునేవారికి యస్ యం యస్ సౌకర్యం కూడా ఉందని యస్ యం యస్ చేసేవారు తమ ఓటరు ఎపిక్ కార్డు నెం వివరాలు అందిస్తే తిరిగి యస్ యం యస్ వారికి వస్తుందన్నారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునేవారు, ఎలక్షన్ కమిషన్ వెబ్ ద్వారా ఫారం-6 పూర్తి చేసి ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ఓటరు నమోదు వివారలు ఓటుబదిలీ వివరాలు వెబ్ సైట్ లో లాగిన్ అయితే అన్నీ వివరాలు వస్తాయన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా కాల్ సెంటర్ ను ప్రారంబించాలని కలెక్టర్ సూచనలు ఇచ్చామన్నారు. ప్రతీ ఓటరు తమ ఓటుహక్కు ఉపయోగించుకునే విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటున్నదన్నారు. నా వ్యక్తిగత ఫోన్ నెంబర్ కూడా వాయిస్ రికార్డు యస్ యం యస్ చేస్తే ఓటరు సమస్యలను పరిష్కరిస్తామన్నారు. నామినేషన్ చివరి రోజు వరకు ఓటుహక్కు కోసం నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.
గతం లో ఓటుహక్కు ఉండి ఇప్పుడు ఓటరు లిస్టులో పేరు లేకపోతే మరలా కోత్తగా ఓటుహక్కును నమోదు చేసుకోవాలన్నారు. కాల్ సెంటరును వ్యక్తి గతంగా కలిసే వీలులేదని 1950 కు ఫోన్ చేయడం ద్వారా ఓటు వావరాలు పొందవచ్చన్నారు. తెలంగాణాలో ఓటు గల్లంతు అయిన విధంగా ఆంధ్రప్రదేశ్ లో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే ఓటరు సమస్యల పై ఒక ప్రత్యేక యాప్ ను తీసుకువస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రత్యేక మీడియా సెంటరును ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిఇఓ వ్యక్తి గత మొబైల్ 9491111091 కు యస్ యం యస్ లేక వాట్సాఫ్ పంపించవచ్చని అయన అన్నారు.