కార్యదీక్షత.. పట్టుదల.. ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వం కలిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టుకే అనేక ప్రత్యేకతలతో కూడుకున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఓ ప్రకటనలో జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలిచ్చే అధికారాన్ని చేపట్టి ప్రజారంజక పాలనతో పునీతుడు కావాలని ఆయన ఆకాంక్షించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసించారు. అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసుకొని గొప్ప పారిశ్రామిక వేత్తగా ఎదుగుతున్న దశలో మహానేత వైఎస్ హఠాన్మరణంతో జగన్ మోహన్రెడ్డి అనేక బాధ్యతలు చేపట్టాల్సిన అవసరమొచ్చిందని తెలిపారు. ఆరు వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. ఆయా కుటుంబాలను ఓదార్చడానికి వెళ్లిన జగన్ మోహన్రెన్ రెడ్డికి ప్రజలు రాజకీయ దిక్సూచిని నిర్దేశించినట్లు బత్తుల పేర్కొన్నారు. రాజన్న ఆశయాలను నెరవేర్చడం కోసం కంకణబద్దులై ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన జగన్ పై నాటి కాంగ్రెస్ ప్రతిపక్షనేతతో కుట్ర పన్ని నిరాధారమైన కేసులతో జైలుకు పంపారు. అయినా ఆయన గుండె నిబ్బరంతో ఎన్ని కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కొని రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా నిలిచినట్లు బత్తుల తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం శ్రమిస్తూ.. జనం ఆదరాభిమానాలు పొందుతూ.. ప్రజా సంకల్పయాత్రను కొనసాగిస్తుంటే.. ఓర్వలేని అధికార పార్టీ శక్తులు ఆయనపై హత్యాయత్నానికి పాల్పడినా మొక్కవోని దీక్షతో యాత్రను కొనసాగిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రజా సంకల్ప యాత్ర ప్రపంచ రికార్డులను బద్దలు చేస్తుందని బత్తుల వ్యక్తం చేశారు. దేవుడి దయతో ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవాలని ఆశిస్తూ జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు.