
ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. కోచింగ్ క్లాస్కు వెళుతున్న ఓ బీటెక్ విద్యార్థినిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి ఆపై సామూహిక అత్యాచారం చేశారు. వివరాల్లోకెళితే.. మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఓ విద్యార్థిని స్కూటీ పై కోచింగ్ తరగతులకు వెళుతుండగా అదే దారిలో కాపు కాసిన నలుగురు యువకులు ఒక్కసారిగా ఆమె వెంటపడ్డారు. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. స్పృహకోల్పోయి పడి ఉన్న బాధితురాలిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆమెను చికిత్స నిమిత్తం అత్యవసర వార్డుకు తరలించారు. అనంతరం ఆస్పత్రి సిబ్బంది యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు కోచింగ్ క్లాస్కు వెళుతుండగా లిఫ్ట్ కావాలన్న సాకుతో ఇద్దరు వ్యక్తులు బలవంతంగా స్కూటీపై కూర్చున్నారని బాధితురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెను పోయా ఘాట్ ప్రాంతానికి తీసుకెళ్లారని, మరో ఇద్దరు నిందితులు ద్విచక్రవాహనంపై అక్కడకు చేరుకుని తన కూతురి జీవితాన్ని నాశనం చేశారని ఆయన వాపోయారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలింపులు చేపడుతున్నారు. ‘విచారణ చేపడుతున్నప్పుడు బాధితురాలి కుటుంబీకులు ఓ వ్యక్తి గురించి చర్చించుకుంటుండగా విన్నాం. వారికి ధైర్యం చెప్పి జరిగినదంతా వివరించాలని కోరాం. ఓ వ్యక్తిపై అనుమానం ఉందని బాధితురాలి తండ్రి చెప్పారు.