అమరావతి లో ఎక్కడా అభివృద్ధి కనిపించలేదు. నీరుకొండ లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం అంటున్నారు, అంతా గ్రాఫిక్స్. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్టీఆర్ గుర్తువచ్చారు, ఎన్టీఆర్ పేరు పెట్టిన ఒక్క పధకం అయినా సక్రమంగా అమలు జరుగుతుందా అని వైకాపా నేత లక్ష్మీ పార్వతి నిలదీసారు. గురువారం అమె మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ పేరు పెట్టి ఎందుకిలా వ్యవహరిస్తున్నావ్ చంద్రబాబు. ఇన్నీ అబద్దాలు చెప్తున్న చంద్రబాబు పేరు గిన్నిస్ బుక్ లో ఎక్కించాలి అని వారికి లెటర్ రాయాలి అనుకుంటున్నానని అన్నారు. చంద్రబాబు నువ్వు ఎన్టీఆర్ కి భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయావ్, ప్రతి అసెంబ్లీలో, మహానాడులో తీర్మానం చేస్తావ్ కదా. చంద్రబాబు నువ్వు రాజకీయ హంతకుడివి, నువ్వు కోట్లు పెట్టి ఎన్టీఆర్ విగ్రహం పెట్టడమా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ని పదవి నుంచి దించిన వ్యక్తివి నువ్వు. నాకు వాజ్ పేయ్ స్వయంగా చెప్పారు...మీ అల్లుడే భారతరత్నకి అడ్డు తగులుతున్నారు అన్నారు. ఎన్టీఆర్ పక్కన నీ విగ్రహం కూడా పెట్టాలి, వెన్నుపోటు పొడిచిన నీ విగ్రహం కూడా పక్కన ఉంటే అందరికి తెలుస్తుంది. ఢిల్లీకి టీడీపీని సాగిలపరిచావ్. చంద్రబాబు 5 ఏళ్లలో నువ్వేం చేశావ్, రాష్ట్రానికి సాధించిందేంటని అడిగారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతా అని జగన్ ప్రకటించారు, నువ్వు ఆ మాత్రం చేయలేకపోయావ్. ఎన్టీఆర్, వైస్సార్ ఇద్దరినీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. నీ పేరు వింటే వెన్నుపోటు, అవినీతి గుర్తువస్తాయని అన్నారు. చంద్రబాబు ని ఓడించాలి అని ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు కి అధికారం, డబ్బు రెండూ చాలు, బాబు డిక్షనరీ లో ఇవే ఉన్నాయ్. అప్పట్లో నన్ను బూచిగా చూపించి అందరిని వాడుకున్నారు, హరికృష్ణ చనిపోయే ముందు కూడా చాలా బాధపడ్డారు. లోకేష్ కి కా అంటే కీ రాదని ఆమె వ్యాఖ్యానించారు. నందమూరి సుహాసిని ఇంట్లో ఉన్న ఆమెని తీసుకొచ్చి ఎన్నికల బరిలో దింపారు. చంద్రబాబు నందమూరి కుటుంబాన్ని కరివేపాకు లా వాడుకుంటున్నారు అని అర్థం అయి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దూరంగా ఉన్నారు. సుహాసిని ట్వీట్ చూసి నా కళ్ళలో నీళ్లు వచ్చాయి, ఆమెని బలిపశువు చేశారు. నేను రాసిన ఎదురులేని మనిషి పుస్తకం ఆధారంగా రాంగోపాల్ వర్మ సినిమా తీస్తున్నారు, ఎన్టీఆర్ గురించి ఎవరికి తెలియని వాస్తవాలు అందులో రాసానని ఆమె వెల్లడించారు.