YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బీసీల పట్ల చులకన భావం సరికాదు !

 బీసీల పట్ల చులకన భావం సరికాదు !
ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను సత్వరమే అమలు చేయాలని మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం ఒంగోలులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టరేట్: వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలుగు దేశం పార్టీ బీసీలకు 110 హామీలు ఇచ్చినట్లు వెల్లడించారు. అందులో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. ఏడాదికి 10 వేల కోట్ల బడ్డెట్ కేటాయిస్తామని చెప్పి అందులో కనీసం నాలుగోవంతు కూడా వెచ్చించలేదు. ఇప్పుడేమో 80వేల కోట్ల ఉప ప్రణాళిక పెడతామంటే ఎవరు నమ్ముతారని వెంకటరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి కార్పొరేషన్లు, మార్కెట్ యార్డుల్లో బీసీలకు మూడో వంతు బీసీలకు ఇస్తామన్నారు. నెరవేర్చారా అంటూ జంకె నిలదీశారు. విద్య, ఉద్యోగాల్లో 33.3 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న హామీ ఏమైందని దుయ్యబట్టారు. బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్ మాట్లాడుతూ రైతు బజార్లు మాదిరి మేకల, గొర్రెల విక్రయ బజార్లు ఏర్పాటు చేస్తామన్న హామీని చంద్రబాబు అటకెక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లు నుంచి అధునాతన ఉత్పత్తి తయారీ, చేనేత కార్మికులకు లక్షన్నరతో ఉచితంగా ఇల్లు, మగ్గం షెడ్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినా నెరవేరలేదని తెలిపారు. మొత్తంగా చంద్రబాబు బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ర్యాలీలో పాల్గొన్న కనిగిరి, కొండపి వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు బుర్రా మధుసూదన్ యాదవ్, మాదాసు వెంకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. ర్యాలీని తొలుత పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో బీసీ అధ్యయన కమిటీ సభ్యులు అవ్వారు ముసలయ్య, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొట్ల రామారావు, నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు, నాయకులు కటారి ప్రసాద్, బొట్ల సుబ్బారావు, పటాపంజుల శ్రీను, పిగిలి శ్రీను, పాదర్తి కోటి, జూటూరి శ్రీను పాల్గొన్నారు.

Related Posts