రఫెల్ వ్యవహారం ఈ దేశ చరిత్రలోనే పెద్ద కుంభకోణం. ఈ ఒప్పందం మీద చాలా అనుమానాలు, ప్రశ్నలు ఉన్నాయి. ఇది దేశ భద్రత ను పణంగా పెట్టి రఫెల్ డీల్ చేశారని కాంగ్రెస్ సినీయర్ నేత వీరప్ప మొయిలీ అన్నారు. గురువారం అయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. 200 శాతం అంచనాలు.. పెంచి రఫెల్ యుద్ధ విమానాలు ఎలా కొన్నారు. మేక్ ఇన్ ఇండియా గురుంచి చెప్పే మోడీ..ఇప్పుడు రఫెల్ విమానాలు ఇండియా లో తయారు చెయ్యకుండా.. ఒప్పందం ఎలా చేసుకున్నారని ప్రశ్నించారు. పీఏసీకి కి కాగ్ నివేదిక ఇవ్వనేలేదు. సుప్రీంకోర్టు కు కేంద్ర సర్కార్ తప్పుడు నివేదికలు ఇచ్చింది..అందుకే తీర్పు అలా వచ్చింది. సుప్రీంకోర్టు ఈ కుంభకోణం తియ్యడం లో సరైన వేదిక కాదనే మేము కోర్ట్ వెళ్ళలేదు..అందుకే.. జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. హెచ్ ఏ ఎల్ కి సామర్థ్యం ఉందని చెపితే నరేంద్రమోదీ మాత్రం లేదని చెప్పారు. ఇది క్రోనీ కాపీటలిసం తో కూడుకున్న.. కుంభకోణమని అయన ఆరోపిచారు. 41000 కోట్ల డబ్బులు డైరెక్ట్ గా ప్రజల డబ్బులు వృధా అవుతున్నాయి. రిలయన్స్, అనిల్ అంబానీ కి లాభం చేర్చుకోవడం కోసమే ఒప్పందమని అన్నారు. బెంచ్ మార్క్.. రేట్ సరిగా లేదని అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ చెప్పారు. జాతి ప్రయోజనాలను పక్కన పెట్టి మోడీ ఈ ఒప్పందం చేసుకున్నారు. ఆఫ్సెట్ పార్టనర్ ఎంపిక లో.. సుప్రీంకోర్టు కు తప్పుడు నివేదిక ఇచ్చారని అయన విమర్శించారు.