పామర్రు కృష్ణా జిల్లాలో ముఖ్యమైన జంక్షన్. గుడివాడ, మచిలీపట్నం విజయవాడ, చల్లపల్లి లకు రోడ్డు ప్రయాణం పామర్రు ద్వారానే జరుగుతుంది. నేషనల్ హైవే 65, 216 లు పామ ర్రు లో క్రాస్ అవుతాయి . ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. రోడ్డు ప్రక్కన రమారమి ఐదు ఎకరాల స్థలం కూడా కలదు ఈ ఆరోగ్య కేంద్రం కు. అమరావతి దగ్గర్లో ఉన్న ముఖ్యమైన జంక్షన్ అవటం వలన, నేషనల్ హైవే ప్రక్కనే తగినంత స్థలం ఉండటంతో, ఇక్కడ ఆసుపత్రి అభివృద్ధి చెందటానికి తగిన ప్రతిపాదనలు ప్రభుత్వం వారికి పంపడం జరిగింది. ట్రామా కేర్ సెంటర్ కూడా పెడితే బాగుంటుందని ఇక్కడి పామర్రు ప్రజలందరూ కొరు కొంటున్నారు..
పామర్రు లో 50 పడకల ఆసుపత్రి ఎంతైనా అవసరము.