శుభోదయం...
కొమ్మలు చూడరే గోవిందుడు
కుమ్మరించీ ముద్దు గోవిందుడు॥
దిట్టబాలులతో తిరిగి వీధుల
కొట్టీ నుట్లను గోవిందుడు
పట్టిన కోలలు పైపై చాపుచు
కొట్టీ దూంట్లుగా గోవిందుడు
నిలువుఁగాశతో నిడి కూతలతో
కొలకొలమని ఈ గోవిందుడు
వలసిన పాలు వారలు వట్టుచు
కులికి నవ్వీ గోవిందుడు
బారలు చాపుచు పట్టగ నింతుల
కూరిమి కూడీ గోవిందుడు
చేరి జవ్వనుల శ్రీ వేంకటాద్రిపై
కోర జెనకీ గోవిందుడు
కొమ్మలు చూడరే గోవిందుడు...
తాళ్ళపాక అన్నమాచార్యులు
...........................................................
రాగం: మోహన
స్వరకర్త & పాడినవారు:
జి.నాగేశ్వరనాయుడు & బృందం