ఫ్రీడం రిఫైన్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్ వంటనూనెలలో ప్రసిద్ధి చెందింది. ఫ్రీడం రిఫైన్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్ వారి ఆధ్వర్యంలో 9 వ ఫ్రీడం కుకరీ తరగతులను ప్రముఖ చెఫ్ పునీత్ మెహతతో నిర్వహించారు. నగరంలోని అసిఫ్ నగర్ లోని రాయల్ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మహిళలు రుచికరమైన డిషెస్ ను తయారు చేయడంపై తరగతులను నిర్వహించారు. పునీత్ మెహత పలు రుచికరమైన ప్రముఖ వంటకాలను వాడటంపై వివరించారు. ఫ్రీడం రిఫైన్డ్ సన్ ఫ్లవర్ నూనెతో వంటకాలు రూపొందించే తయారీ విధానం వివరించారు. 9 వ ఫ్రీడం కుకరీ తరగతులకు మంచి స్పందన లభించిందని ఫ్రీడం రిఫైన్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్ సేల్స్ మార్కెటింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ పి. చంద్ర శేఖర్ రెడ్డి అన్నారు. పాకశాస్త్ర నిపుణలతో రుచికరమైన వంటలు తయారీపై వివరింపజేయడంతో ఔత్సాహికులు నుంచి మంచి స్పందన లభించిందన్నారు.