జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్లో కాన్సర్ కారక అస్బెస్టాస్ కణాలు ఉన్నాయని నివేదికలు వెలువడిన సంగతి తెలిసిందే. తదుపరి ఆదేశాలను జారీ చేసేవరకు ముంబైలోని ములుంద్, హిమాచల్ ప్రదేశాలలోని బడ్డీ యూనిట్లలో టాల్కమ్ పౌడర్ ముడి పదార్దాలను వాడొద్దని జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ అఫ్ ఇండియా (డీ సి జీ ఐ ) ఆదేశించింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ములుంద్, బడ్డీ యూనిట్ల పరిధిలోని జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ నమూనాలను డ్రగ్ ఇన్స్పెక్టర్ సేకరించారు.