YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ప్రభాస్ ఇంటి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

ప్రభాస్ ఇంటి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
సినీ నటుడు ప్రభాస్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. శుక్రవారం హైకోర్టులో ప్రభాస్ పిటిషన్‌పై విచారణ జరిగింది. యథాతధ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌పై 24న కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 31కి వాయిదా వేసింది. రాయదుర్గంలోని పాన్ మక్తా గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 46లో గల 84 ఎకరాల 30 గుంటల భూమి ప్రభుత్వానిదేనంటూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో.. శేరిలింగంపల్లి తహసీల్దార్‌ వాసుచంద్ర ఆ స్థలంలోని నిర్మాణాలు తొలగించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో ప్రభాస్‌ ఇల్లు ఉండటంతో దాన్నీ సీజ్‌ చేశారు. అయితే తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇల్లు సీజ్ చేయడంపై ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Related Posts